100 ఏళ్ల బామ్మ.. యోగా టీచర్.. ఫోటోలు

Thu,April 18, 2019 01:43 PM

Meet The 100 Year Old Yoga Instructor

100 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు ఎలా ఉంటారు చెప్పండి. అసలు వందేళ్లు ఎవరైనా బతికితే కదా చెప్పడానికి అని అంటారా? అవును.. నిజమే ఈరోజుల్లో 100 ఏళ్లు బతకడమే కష్టం. బతికినా.. మంచం మీదే వాళ్ల బతుకు. వాళ్లకు అన్ని సపర్యలు చేస్తూ ఉండాలి. కానీ.. ఈ బామ్మను చూస్తే మీరు నోరెళ్లబెడతారు. ఆ బామ్మకు 100 ఏళ్లు. అలాగని ఓ మూలకు కూర్చొని కృష్ణా, రామా అనడం లేదు. యోగా టీచర్‌గా పని చేస్తోంది. ఈ వయసులోనూ మహిళలకు యోగా క్లాసులు చెబుతూ ఎంతో ఉత్సాహంగా ఉంటోంది. నిజంగా షాకింగ్‌గా ఉంది కదా ఈ బామ్మను చూస్తుంటే.

ఈ బామ్మ పేరు టవో పోర్చోన్ లించ్. పేరు పెద్దగా ఉంది కదా.. ఇప్పటి నుంచి లించ్ అని పిలుచుకుందాం బామ్మను. లించ్‌ది న్యూయార్క్. కాకపోతే ఈమెకు భారత్‌తో సంబంధం ఉంది. అందుకే యోగా ఆమె జీవితం అయింది. తను ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఇండియాలో ఓ బీచ్ పక్కన కొందరు బాలురు యోగా చేస్తుండగా చూసి తను కూడా యోగా నేర్చుకోవాలనుకున్నది. కష్టపడి నేర్చుకొని అప్పటి నుంచి యోగా ట్రెయినర్‌గా పని చేస్తోంది. ఇప్పుడు తనకు వందేళ్లు నిండినప్పటికీ యోగాను మాత్రం వదలలేదు లించ్.

బామ్మ యోగా మాత్రమే కాదు.. బాల్ డ్యాన్స్ కూడా చేస్తుంది. ఇప్పటికీ ఎంతో హుషారుగా ఉంటూ... తన ట్రెయినింగ్ క్లాస్‌కు వచ్చే మహిళలతో పోటీ పడుతు మరీ లించ్ యోగా చేయడం చూసి తన దగ్గర యోగా నేర్చుకోవడానికి వచ్చేవాళ్లు షాక్ అవుతారట.

నాకు వందేళ్లు నిండినా.. రెండొందల ఏళ్లు నిండినా.. నేను ఇలాగే ఉంటా. నేను ఎప్పుడూ భయపడను.. యోగా చేయడం మానను.. అంటున్న ఈ బామ్మను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందే.


2117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles