ట్రెండింగ్‌లో 'మీటూ' హ్యాష్‌టాగ్.. ఎందుకంటే?

Mon,October 16, 2017 03:55 PM

Me Too Hashtag trending online on women harassment

మీటూ.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌టాగ్ ఇది. అమెరికన్ స్టార్ హీరోయిన్ అలిస్సా మిలానో ఈ హ్యాష్‌టాగ్‌కు ఆద్యం పోసింది. హాలీవుడ్ మొఘల్ హార్వే వైన్‌స్టీన్‌ సెక్స్ స్కాండల్ గురించి సోషల్ మీడియాలో మరింత ప్రచారం చేయడానికి... హార్వే బారిన పడిన అందరు తమ చేదు అనుభవాలను 'మీటూ' అని హ్యాష్ టాగ్ చేసి అతడి ఆకృత్యాలను వెలుగులోకి తీసుకురావాలని ట్వీట్ చేసింది.గత వారం రోజుల నుంచి వైన్‌స్టీన్ ఉదంతం హాలీవుడ్‌ను అత్యంత దారుణంగా కుదిపేసింది. వైన్‌స్టీన్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండడంతో హాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. నటి కావాలన్న మోజులో సినీరంగంపై ఆసక్తి కనబరిచే అమ్మాయిలను.. వైన్‌స్టీన్ లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే యువ హీరోయిన్లు ఒక్కొక్కరుగా తాము అనుభవించిన ఇబ్బందులను బయటపెడుతున్నారు. దీంతో వైన్‌స్టీన్‌పై ఒత్తిడి ఎక్కువైంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను వైన్‌స్టీన్ ఖండించారు.


ఆయన తరపున లాయర్లు కూడా అదే మాట చెబుతున్నారు. నిర్మాత వైన్‌స్టీన్ ప్రవర్తనపై వరుసగా వస్తున్న ఆరోపణలతో అమెరికా పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఒక్క హాలీవుడ్‌నే కాదు.. వైన్‌స్టీన్ వల్ల అమెరికా రాజకీయాల్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. వైన్‌స్టీన్ తమను వేధించారని ఫేమస్ హీరోయిన్లు గ్వినిత్ పాల్ట్రో, ఏంజలినా జోలీలు ఆరోపించారు. కొన్ని దశాబ్ధాలుగా వైన్‌స్టీన్ ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 20 మంది హీరోయిన్లు ఈ ఆరోపణలు చేశారు. వైన్‌స్టీన్ చర్యలు హేయంగా ఉన్నాయని హాలీవుడ్ హీరో బెన్ ఎఫ్లెక్ ట్వీట్ చేశాడు.


తాజాగా ఆయన వేధింపుల లిస్ట్ లో హీరోయిన్ అలిస్సా మిలానో కూడా చేరింది. ఎప్పుడైతే సోషల్ మీడియాలో మీటూ హ్యాష్‌టాగ్‌ను అలిస్సా క్రియేట్ చేసిందో... గంటల వ్యవధిలోనే మీటూ హ్యాష్‌టాగ్‌తో చాలామంది హార్వే వైన్‌స్టీన్‌తో వేధింపులకు గురయిన వారంతా.. తమ బాధలను సోషల్ మీడియాతో పంచుకున్నారు. దీంతో వైన్‌స్టీన్‌కు మరిన్ని చిక్కులు వచ్చే ప్రమాదం ఏర్పడింది.

3200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS