తల్లీ.. నువ్వు అబల కాదు సబల.. వీడియో

Thu,January 3, 2019 04:01 PM

McDonald Employee Attacked and She Fights Back Video Is Viral

అది ఫ్లొరిడాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్. ఓ వ్యక్తి రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఆర్డర్ ఇచ్చాడు. స్ట్రాలు లేవని స్టాఫ్‌ను అడిగాడు. లాబీల్లో ప్లాస్టిక్ స్ట్రాలు ఇవ్వలేమంటూ డొనాల్డ్స్ ఎంప్లాయి చెప్పింది. అయినా వినలేదు ఆ వ్యక్తి. కౌంటర్ దగ్గరికి వెళ్లాడు. క్యాషియర్‌ను తిట్టాడు. మళ్లీ వచ్చాడు.. అతడికి సర్వ్ చేస్తున్న డొనాల్డ్స్ ఎంప్లాయి అయిన యువతిని కాలర్ పట్టుకొని లాగబోయాడు. అంతే.. చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి వెంటనే తేరుకొని ఆ వ్యక్తిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. ఈ ఘటనను మెక్‌డొనాల్డ్స్ కస్టమర్ ఒకరు వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడమే కాదు.. ఆ యువతిని నెటిజన్లు తెగ పొడుగుతున్నారు. నీలాంటి వాళ్లు ఈ సమాజంలో ఉండాలి. అప్పుడు మిగితా మహిళలు కూడా నిన్ను చూసి సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకుంటారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

3548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles