కాబూల్‌లో భారీ పేలుడు.. 40 మంది మృతి

Sun,August 18, 2019 06:54 AM

Massive Blast Hits Kabul Wedding.. 40 dead

ఆఫ్గాన్: అఫ్గనిస్తాన్ రాజధాని నగరం కాబూల్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 40 మంది మృతిచెందగా మరో 100 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గడిచిన రాత్రి 10.40 గంటలకు పశ్చిమ కాబూల్‌లోని ఓ పెండ్లి వేడుకలో బాంబు పేలుడు సంభవించినట్లు దేశ అంతర్గత వ్యవహారాలశాఖ ప్రతినిధి నస్రత్ రహీమి తెలిపారు. పేలుడు తామే బాధ్యులమని ఇంతవరకు ఓ గ్రూప్ ప్రకటించలేదు. ఈ నెల 14న సైతం భద్రతా దళాలే లక్ష్యంగా తాలిబన్ల దాడికి పాల్పడ్డారు.

765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles