విద్యార్థుల‌పై క‌త్తితో దాడి.. 17 మందికి గాయాలు

Tue,May 28, 2019 09:53 AM

mass stabbing in Japan, school girls injured

హైద‌రాబాద్‌: జ‌పాన్‌లో ఓ ఉన్మాది క‌త్తితో సామూహిక దాడికి పాల్ప‌డ్డాడు. ఓ స్కూల్ బ‌స్‌స్టాప్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ దాడిలో సుమారు 17 మంది గాయ‌ప‌డ్డారు. మ‌రో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. క‌వాసాకి న‌గ‌రంలో ఈ దారుణం జ‌రిగింది. క‌త్తితో వ‌చ్చిన ఓ ఉన్మాది.. స్కూల్ బ‌స్‌స్టాప్ వ‌ద్ద వేచి చూస్తున్న విద్యార్థుల‌పై దాడి చేశాడు. ఎక్కువ శాతం బాలిక విద్యార్థినుల‌ను ఉన్మాది టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. పిల్ల‌ల చేతుల‌పై క‌త్తితో పొడిచాడు. ఈ ఘ‌ట‌న‌లో ఓ చిన్నారితో పాటు మ‌రో 50 ఏళ్ల వ్య‌క్తి మృతిచెందాడు. అయితే దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి.. త‌న‌ను తాను పొడుచుకున్నాడు. మెడ‌పై త‌నంతట తానే దాడి చేసుకున్నాడు. సంఘట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ ఉన్మాదిని అరెస్టు చేశారు. ఇవాళ ఉద‌యం 7.44 నిమిషాలకు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఆ ఉన్మాది ఎందుకు పిల్ల‌ల్ని టార్గెట్ చేశార‌న్న విష‌యం ఇంకా స్ప‌ష్టం కాలేదు. ప్ర‌స్తుతం జ‌పాన్ టూర్‌లోనే ఉన్న అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘ‌ట‌న ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. నిజానికి జపాన్‌లో క్రైమ్‌రేట్ చాలా త‌క్కువ‌. అది కూడా ఇలా సామూహికంగా దాడి చేసే ఘ‌ట‌న‌లు అరుదు. 2016లో ఓ వ్య‌క్తి టోక్యోలో ఓ మానసిక వైద్యాల‌యంపై దాడి చేసి 19 మందిని చంపాడు.

1625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles