భూమికి దగ్గరగా వస్తున్న అరుణ గ్రహం

Tue,June 19, 2018 01:27 PM

Mars to come closest to Earth on July 27th says NASA

వాషింగ్టన్: విశ్వంలోని వింతలపై ఆసక్తి చూపేవాళ్లకు ఇది గుడ్‌న్యూస్. 15 ఏళ్ల తర్వాత మరోసారి అరుణ గ్రహం భూమికి దగ్గరగా వస్తున్నది. సూర్యుడికి ఎదురుగా వచ్చి మరింత ప్రకాశవంతంగా కనిపించనుంది. జులై 27న ఈ అరుదైన వింత జరగనున్నట్లు నాసా వెల్లడించింది. సూర్యుడికి ఎదురుగా రావడం వల్ల ఆ కాంతి మార్స్‌పై పడి అది ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుందని నాసా చెప్పింది. సూర్యుడు, మార్స్ ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండటాన్ని మార్స్ అపోజిషన్‌లో ఉండటం అని అంటామని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.

ప్రతి 15 నుంచి 17 ఏళ్లకు ఈ అపోజిషన్ ఏర్పుడుతుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ సమయంలో మార్స్.. సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. మార్స్ కక్ష్యలో అపోజిషన్ ఎప్పుడైనా ఏర్పడవచ్చు. అయితే అది సూర్యుడికి దగ్గర ఉన్న సమయంలో ఏర్పడినపుడు అరుణ గ్రహం భూమికి అతి చేరువగా వస్తుంది అని నాసా స్పష్టంచేసింది. దీనిని పెరిఫెలిక్ అపోజిషన్ అంటారు. సుమారు 60 వేల ఏళ్ల తర్వాత 2003లో భూమికి అతి చేరువగా మార్స్ వచ్చినట్లు నాసా తెలిపింది.

2895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles