కుక్క నాకితే.. కాళ్లు, చేతులు తీసేశారు!

Fri,August 3, 2018 01:42 PM

Mans Legs, Forearms Amputated After Dog Lick Leads To Horrifying Infection

న్యూయార్క్: ప్రపంచంలో ఏదోఒక చోట ప్రతి రోజు చాలా మంది ప్రజలు కొన్ని వింతైన, అంతుచిక్కని వ్యాధుల బారిన పడుతున్నారు. తాజాగా మరో అరుదైన అంటువ్యాధి సోకడంతో ఓ వ్యక్తి మోచేతులు, మోకాళ్ల కింది శరీర భాగాలను తొలగించారు. అయినప్పటికీ అతడికి మళ్లీ సర్జరీ చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన అమెరికాలోని విస్‌కాన్సిన్‌లో వెలుగులోకి వచ్చింది.

గత జూన్‌లో గ్రెగ్ మాంటెఫెల్(48) అనే వ్యక్తికి ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపించడంతో మిల్వాకీ ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా అతడు అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. తన భర్తను కుక్క నాకడంతో అరుదైన అంటువ్యాధి సోకిందని అతని భార్య డాన్ మాంటెఫెల్ గురువారం చెప్పింది. తన భర్తకు ఇప్పటికే ఏడు సర్జరీలు జరిగినప్పటికీ కుంగుబాటుకు లోనుకాకుండా ధైర్యంగా ఉన్నారని ఆమె వెల్లడించారు.

అసలు ఆ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడటానికి కారణాలను వైద్యులు వివరించారు. సాధారణంగా పిల్లులు, కుక్కల లాలాజలంలో క్యాప్నోసైటోఫాగా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కారణంగానే రక్తానికి ఈ వ్యాధి సోకింది. ఐతే జంతుప్రేమికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇది చాలా అరుదైన వ్యాధి అని ఎప్పటిలాగే ఇకపై కూడా మీ పెంపుడు జంతువులతో ప్రేమగా ఉండొచ్చని చెప్పారు.

ఈ వ్యాధి కారణంగా గ్రెగ్ బీపీ అనూహ్యంగా పెరిగింది. దాంతో పాటు అతని చేతులు, కాళ్లకు రక్తప్రసరణ వేగంగా స్తంభించింది. ఐతే అతడి ప్రాణాలకే ప్రమాదం ఉండటంతో ఈ నేపథ్యంలోనే అతని శరీర భాగాలను తొలగించడం తప్పనిసరైంది. ముందుగా అతని మోకాళ్ల కింద భాగం, మోచేతులు వరకు శస్త్రచికిత్స చేసి వాటిని తీసేశారు. తన ముక్కు భాగానికి కూడా రక్తప్రసరణ తగ్గుతోందని, దాని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సర్జరీ అవసరమని గ్రెగ్ భార్య చెప్పింది.

7616
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles