లక్కంటే మనోడిదే.. వారం వ్యవధిలో రెండు లాటరీలు గెలిచాడు!

Mon,May 14, 2018 05:47 PM

Man wins two million dollar lotteries within a Week in Australia

మనం ఎంత తిప్పలు పడినా.. అదృష్ట రేఖ లేకుంటే ఏం చేయలేం. ఏం చేయకున్నా.. అదృష్ట రేఖ ఉంటే వద్దన్నా ధనలక్ష్మి తలుపు తడుతుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఓ 40 ఏండ్ల వ్యక్తికి ముందుగా 7,70,000 యూఎస్ డాలర్ల విలువైన లాటరీ తలిగింది. అంటే మన కరెన్సీలో సుమారు 5 కోట్ల 20 లక్షలు. ఇక.. లాటరీ తలిగిందని మనోడు సెలబ్రేషన్స్ చేసుకుంటుండగానే.. ఇంకో లాటరీ తలిగింది. 1,457,834 ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. అంటే మన కరెన్సీలో 7 కోట్ల 43 లక్షల రూపాయలు. దీంతో మనోడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

"ఈ డబ్బుతో పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టకుండా సిడ్నీలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతా. అసలు ఒక వారం వ్యవధిలో రెండు లాటరీలు గెలుపొందడంనిజంగా నా అదృష్టమే. కాని.. నిజంగా ఎలా విన్ అయ్యానో నాకే తెలియట్లేదు.." అని లాటరీ గెలిచిన వ్యక్తి తెలిపాడు.

"ఒక వారంలో రెండు లాటరీలు గెలవడం చాలా కష్టం. 1.845 మిలియన్ మందిలో ఒక్కరిని మాత్రమే ఈ చాన్స్ వరిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక వారంలో రెండు లాటరీలు గెలుపొందిన వ్యక్తినైతే ఇంతవరకు చూడలేదు. అయితే.. రెండు లాటరీలు గెలిచిన వాళ్లు చాలామందే ఉన్నప్పటికీ.. వాళ్లు ఒకవారం వ్యవధిలో అయితే గెలవలేదు. వారి జీవిత కాలంలో రెండు సార్లు గెలిచారు. ఇది నిజంగా రికార్డే.." అని లాటరీ నిర్వాహకులు తెలిపారు.

ఆస్ట్రేలియాలో లాటరీలు సహజం, చాలా పాపులర్. ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వానికి చెందిన సంస్థలు కూడా లాటరీలను నిర్వహిస్తుంటాయి. జనవరిలో విక్టోరియాకు చెందిన ఓ వ్యక్తి 55 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల లాటరీని విన్నయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఈ వ్యక్తి రెండు లాటరీలు గెలుపొంది చరిత్ర సృష్టించాడు.

8642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS