గవ్వలు, శంఖాల కోసం సముద్రంలోకి వెళ్లి చిక్కుకున్నాడు..వీడియో

Tue,June 19, 2018 05:47 PM

man went into sea to collect shells, conch

చైనా: ఓ వ్యక్తి తన ప్రాణాల మీద ఏ మాత్రం భయం లేకుండా సముద్రంలోకి వెళ్లి అక్కడే మధ్యలోనే చిక్కుకునిపోయాడు. ఈ ఘటన చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో జరిగింది. సముద్రంలో పెద్ద ఎత్తున అలలు వస్తూనే ఉన్నాయి. చైనాకు చెందిన సదరు వ్యక్తి మాత్రం గవ్వలు, శంఖాలను సేకరించేందుకు సముద్రంలోకి వెళ్లాడు.

సముద్రం మధ్యలో ఉన్న శిలలపై నిలబడి తన పని ప్రారంభించాలనుకున్నాడు. అంతలోనే అలలు భారీ ఎత్తున అతి వేగంగా తీరంవైపు దూసుకొస్తున్నాయి. ఇక ఆ వ్యక్తి శిలలపై బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాడు. అయితే తీర ప్రాంతంలో ఉన్న కొంతమంది అగ్నిమాపక సిబ్బంది అతన్ని గుర్తించారు. వారంతా లైఫ్ జాకెట్లు ధరించి అలలు ఉధృతిని లెక్కచేయకుండా సముద్రంలోకి వెళ్లి అతన్ని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. అలల మధ్య చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన వీడియో ఇపుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూడండి..


3361
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles