కొత్త హెయిర్ స్టయిల్ కోసం ట్రై చేస్తే బెడిసికొట్టింది!

Sat,December 9, 2017 06:33 PM

Man tries for new hairstyle but his forehead swelled

ఈ రోజుల్లో ఏది చేసినా ఫ్యాషనే. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఈ జనరేషన్ ఎంతగానే ప్రయత్నిస్తున్నది. దానికనుగుణంగానే ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాగే.. సరికొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో ఏమో... యూఎస్‌లోని టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తి తన హెయిర్ స్టయిల్‌ను కొత్తగా మార్చుకుందామనుకున్నాడు.

కాని.. ఆ కొత్త హెయిర్ స్టయిలే బెడిసికొట్టింది. ఇంతకీ ఏం హెయిర్ స్టయిల్ చేయించుకున్నాడనేగా మీ డౌట్. స్టయిల్ లేదు గియిల్ లేదు. ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండు గీకించుకున్నాడు. తర్వాత బయటికి వెళ్లాడు. అయితే.. ఎండ వేడికి మనోడి గుండు కాస్త వేడెక్కి తల ముందు భాగం ఉబ్బిందట.

దీంతో తన ఫోర్‌హెడ్ మీద వేలితో నొక్కగానే గుండుకు సొట్ట పడిందట. వామ్మో.. ఇదేం హెయిర్ స్టయిల్‌రా బాబోయ్ అనుకొని ఎవరూ ఇటువంటి హెయిర్ స్టయిల్‌ను ట్రై చేయకండి. ఒకవేళ చేసినా.. సన్ స్క్రీన్స్‌ను తప్పకుండా వాడండి.. ఇదిగో.. నాకు ఇలా జరిగింది. అంటూ సొట్ట పడిన గుండును ఫోటోలు తీసి మరీ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఆ గుండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.


5911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS