చిన్నారిని రక్షించడం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టాడు.. వీడియో

Wed,May 23, 2018 06:23 PM

Man risks his life to save 2 year old girl child in china

ఎవరి ప్రాణాలు వాళ్లకు తీపే. ప్రాణాలకు ప్రమాదం అని తెలిస్తే ఎవరూ దాని జోలికే వెళ్లరు. మనిషికి ప్రాణాలపై అంత ఆశ. కాని.. ఈ వ్యక్తికి ప్రాణం మీద ఆశ లేనట్టుంది. రెండేండ్ల చిన్నారి ప్రాణం కాపాడటం కోసం రిక్షాకు అడ్డంగా వెళ్లాడు. మూతి పండ్లు రాలగొట్టుకున్నాడు. నిజానికి.. అతడు చేసిన సాహసం వల్లనే ఆ పాప బతికి బయటపడింది. ఆ సాహసం ఎవరూ చేయలేకపోయారు. కాని.. ఆ వ్యక్తి ముందుకొచ్చి ఆ పాపను రక్షించడం కోసం ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఈ ఘటన చైనాలోని లంకొవా కంట్రీలోని హెనన్‌లో చోటు చేసుకున్నది. అసలేంజరిగిందంటే...ఓ ఎలక్ట్రానిక్ రిక్షా దూసుకొస్తున్నది. ఆ రిక్షాలో ఎవరూ లేరు. కాని.. అది వేగంగా రోడ్డు మీద పరిగెత్తుకొస్తున్నది. ఆ రిక్షాకు రెండేండ్ల పాప వేలాడుతున్నది. ఆ పాపను రక్షించడం కోసం అంతా ఆ రిక్షా వెనక పరిగెడుతున్నారు కాని ఒక్కరూ దాన్ని ఆపలేకపోయారు. దీంతో ఆ పాపను ఎలాగైనా రక్షించాలని ఓ వ్యక్తి దానికి అడ్డంగా పరిగెత్తాడు. దీంతో అతడిని బలంగా ఢీకొట్టిన రిక్షా వెంటనే ఆగిపోయింది. రిక్షా బలంగా ఢీకొట్టడంతో అతడు ఎగిరి కింద పడ్డాడు. దీంతో ఆ పాప సేఫ్. మనోడికి గాయాలయ్యాయి కాని అంత సీరియస్ కాదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

5140
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles