టాటూల కోసం పురుషాంగాన్నే కట్ చేయించుకున్నాడు..!

Thu,July 19, 2018 06:46 PM

Man removes private parts to cover entire body with tattoos in Russia

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టుగా ఈ వ్యక్తి టాటూల కోసం తన పురుషాంగాన్నే కట్ చేయించుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌కు చెందిన 32 ఏండ్ల అడమ్ కర్లీకలెకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ ఎఫెక్ట్ వల్ల అడమ్ శరీరమంతా మచ్చలు మచ్చలుగా మారింది. దాంతో పాటు అడమ్ బొల్లి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ మచ్చలతో అడమ్ బయటికి వెళ్లాలంటే భయపడేవాడు. దాని నుంచి తప్పించుకోవడానికి ఒళ్లంతా టాటూలు వేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఒళ్లంతా ఐబాల్స్ టాటూలు వేయించుకున్నాడు.

కాని.. తన శరీరంలో 90 శాతం మాత్రమే టాటూలు కవర్ అయ్యాయి. ప్రైవేట్ పార్ట్స్‌లో మాత్రం టాటూలు కవర్ కాలేదు. అక్కడ టాటూ వేయడం సమస్యగా మారింది. ఎలాగైనా శరీరం మొత్తం టాటూలు కవర్ చేయాలనుకొని తన ప్రైవేట్ పార్ట్స్‌ను కట్ చేయించుకున్నాడు. పురుషాంగం, వృషణాలు, చాతి దగ్గర ఉండే చనుమొనలను ఆపరేషన్ ద్వారా తీసేయించుకున్నాడు అడమ్. దీంతో తన శరీరమంతా సమాంతరంగా మారింది. ఇక.. అడమ్ తన శరీరం మొత్తం టాటూలు వేసుకునే అవకాశం దొరికింది. అయితే.. ఈ ఆపరేషన్ కోసం అడమ్ రష్యా నుంచి మెక్సికో వెళ్లాడు. మెక్సికోలో ఈ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ అనంతరం హాస్పిటల్‌లో ఉన్న అడమ్ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అడమ్ టాటూల స్టోరీ వైరల్‌గా మారింది.

8614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles