సముద్రంలో వేల్‌తో గేమ్ ఆడాడు..వీడియో

Wed,November 13, 2019 03:01 PM


సాధారణంగా ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలతో బంతి విసిరే ఆట ఆడుతుంటారు కదా. బంతి విసరగానే కుక్క వెంటనే దాన్ని తీసుకొచ్చి యజమాని చేతిలో పెడుతుంది. ఓ వ్యక్తి ఇలాంటి ఆటనే ఏకంగా వేల్‌తో ఆడి ఔరా అనిపించాడు. ఈ ఆటను సముద్రంలో ఆడటం గమనార్హం. ఆర్కిటిక్ సముద్రంలో జెమిని క్రాఫ్ట్ బోటులో వెళ్తున్న రగ్బీ ఆటగాడు బెలుగ వేల్‌ను గమనించి బంతిని నీటిలోకి విసిరాడు. ఆ వేల్ వెంటనే బంతిని నోటిలో కరుచుకుని బోటులో ఉన్న ఆటగాడికి అందించింది. ఇలా నీటిలో వేసిన ప్రతీసారి బంతిని తీసుకొచ్చి సదరు ఆటగాడికి అందించింది. వేల్ ఎంతో శ్రద్దతో ఆటలో పాల్గొని ఎంతోమంది ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చింది.


జెలిమ్ నెల్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోకు ట్విట్టర్‌లో ఒక్కరోజులోనే 4.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదే వీడియోను మరో వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా..1.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.


2165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles