బ‌స్సులో మ‌హిళా ఎంపీ ముందు ఓ వ్య‌క్తి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

Sat,April 13, 2019 09:30 AM

Man masturbates in front of Pakistan origin UK lawmaker on London bus

హైద‌రాబాద్‌: పాకిస్థాన్ సంత‌తికి చెందిన బ్రిటీష్ మ‌హిళా ఎంపీ నాజ్ షాకు లండ‌న్ బ‌స్సులో చేదు అనుభ‌వం ఎదురైంది. లేబ‌ర్ పార్టీ నేత బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి ఆమె ముందు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల షాకైన‌ట్లు ఆమె చెప్పారు. తాను కూర్చున్న సీటుకు ఎదురుగా కూర్చున్న ఓ వ్య‌క్తి.. త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆమె త‌న ఫిర్యాదులో వెల్ల‌డించారు. ఆ వ్య‌క్తి అస‌హ‌జ లైంగిక సంకేతాలు చేసిన‌ట్లు ఎంపీ నాజ్ షా పోలీసులకు తెలిపారు. నాజ్ షా .. బ్రాడ్‌ఫోర్డ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఉద్యోగాల‌కు వెళ్లే మ‌హిళ‌ల‌కు వేధింపులు ఎక్కువ అవుతున్నాయ‌ని ఆ ఎంపీ ఆరోపించారు. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లోనూ ఆమె త‌న‌కు జ‌రిగిన ఘ‌ట‌న ప‌ట్ల అనుభ‌వాన్ని వ్య‌క్త‌ప‌రిచారు.

3362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles