ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం 11 అంతస్తుల నుంచి దూకాడు.. వీడియో

Fri,January 18, 2019 03:56 PM

Man jumps from 11th floor of Cruise Ship for Instagram Video

వాషింగ్టన్: సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం కొంత మంది ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాగే వాషింగ్టన్‌కు చెందిన 27 ఏళ్ల నికోలాయ్ నేదేవ్ అనే వ్యక్తి ఓ క్రూజ్ షిప్ 11వ అంతస్తు నుంచి సముద్రంలోకి దూకాడు. బహమాస్‌లోని నాసౌలోని రాయల్ కరీబియన్ క్రూజ్ షిప్ నుంచి అతను ఈ సాహసం చేశాడు. అతన్ని కిందికి దూకాల్సిందిగా అతని ఫ్రెండ్స్ రెచ్చగొట్టడం వీడియోలో కనిపిస్తుంది. దీంతో నికోలాయ్‌తోపాటు అతని ఫ్రెండ్స్ జీవితంలో మళ్లీ తమ షిప్ ఎక్కకుండా రాయల్ కరీబియన్ నిషేధం విధించింది. ఇది నిర్లక్ష్యపూరిత ప్రవర్తన అని, వాళ్లపై నిషేధం విధించినట్లు క్రూజ్ షిప్ మేనేజర్ వెల్లడించారు. అయితే అంతకుముందు రాత్రి తాగిన మత్తు తనకు ఇంకా దిగలేదని, అందుకే 11వ అంతస్తు నుంచి దూకినట్లు నికోలాయ్ చెబుతున్నాడు. ఈ పోస్ట్‌కు ఊహించినట్లే వేల కొద్దీ కామెంట్స్ వచ్చినా.. అందులో చాలా వరకు అతన్ని తిడుతూనే కామెంట్స్ చేశారు.

View this post on Instagram

Full send

A post shared by Nick Naydev (@naydev91) on

1992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles