కంపు కొట్టే సాక్స్ వాసన చూశాడు.. ఆసుపత్రి పాలయ్యాడు!

Mon,December 17, 2018 03:01 PM

Man in China Hospitalised with lung infection after sniffing his own socks

బీజింగ్: కంపు కొడుతున్న సాక్స్ వాసన ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు కదా. అలాంటి సాక్స్ వేసుకొని ఎవరైనా పక్కన కూర్చుంటేనే మనకు ఒళ్లు మండుతుంది. అలాంటిది చైనాలో ఓ వ్యక్తి మాత్రం ప్రతి రోజూ తాను వేసుకునే సాక్స్ వాసన చూడటమే అలవాటుగా మార్చుకున్నాడు. చివరికి ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. ఫుజియాన్ ప్రావిన్స్‌కు చెందిన ఆ వ్యక్తికి ప్రతి రోజూ తన పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత తాను వేసుకున్న సాక్స్ వాసన చూడటం అలవాటైంది. ఇలా రోజూ చేయడం వల్ల ఆ సాక్స్‌లోని ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి చేరి అతను మంచాన పడ్డాడు. అతని రోగ నిరోధక వ్యవస్థ కూడా బాగా దెబ్బ తిన్నది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కంపు కొట్టే సాక్స్ ఎంత డేంజరో ఈ ఘటనతో తేలిపోయింది. వాసన ఇబ్బంది కలిగించడమే కాదు.. వాటి వల్ల ఆరోగ్యానికి కూడా హానికరం అని చెప్పడానికి ఈ కేసే నిదర్శనం.

4588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles