
అది ఒక్క ఫ్లోర్ కాదు.. రెండు ఫ్లోర్లు అసలే కాదు.. ఏకంగా 23వ ఫ్లోర్ నుంచి ఓ వ్యక్తి వేలాడాడు. దాని నుంచి కిందికి చూస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అటువంటిది.. ఓ వ్యక్తి అక్కడి నుంచి వేలాడి బతికి బయటపడ్డాడు. అయితే.. ఆ వ్యక్తి 23వ ఫ్లోర్ వద్ద వేలాడటానికి ఓ కారణం ఉంది. ఆ బిల్డింగ్‌కు మంటలంటుకోవడంతో ఏం చేయాలో పాలు పోని ఆ వ్యక్తి మంటల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా 23వ ఫ్లోర్‌కు వేలాడాడు.
ఆ తర్వాత ఆ ఫ్లోర్‌కు ఉన్న గ్రిల్స్‌ను తొలగించి లోపలికి వెళ్లి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన చైనాలోని చోంగ్‌కింగ్ సిటీలో చోటు చేసుకున్నది. డిసెంబర్ 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపుతున్నది.