ఈ రిచ్ ప్రేమికుడు చేసిన పనికి గర్ల్‌ఫ్రెండ్ ఫిదా.. వైరల్ ఫోటో

Fri,May 25, 2018 02:18 PM

Man gifts girlfriend bouquet of cash worth 35 Lakh rupees in china

గర్ల్‌ఫ్రెండ్‌ను ఫిదా చేయడం అంత వీజీ కాదు లేండి. కాని.. తలుచుకుంటే ఎవరినైనా ఫిదా చేసేయొచ్చని నిరూపించాడు ఈ రిచ్ ప్రేమికుడు. కరెన్సీతో తయారుచేసిన దండలు, కరెన్సీతో అలంకరించిన దేవుళ్లను మీరు చూసుంటారు కాని.. ఈ రిచ్ ప్రేమికుడు చేసిన పనిని ఇంతవరకు చూసి ఉండరు. తన గర్ల్ ఫ్రెండ్ పుట్టిన రోజున తనకు మాంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. కాని.. అందరిలా సాదాసీదా గిఫ్ట్ ఇస్తే ఏముంటుంది మజా అనుకున్నాడో ఏమో.. కొత్తగా ఆలోచించి వినూత్నమైన గిఫ్ట్‌ను తన గర్ల్ ఫ్రెండ్‌కు ఇచ్చి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అంతే కాదు.. గర్ల్ ఫ్రెండ్ కూడా మనోడి గిఫ్ట్‌కు ఫిదా అవ్వడమే కాదు. ఇక నాజీవితం నీకే అని చెప్పేంత గిఫ్ట్ ఇచ్చి గర్ల్ ఫ్రెండ్‌ను మైమరిపించాడు. ఈ డొంకతిరుగుడంతా ఆపి అసలు ఏం గిఫ్ట్ ఇచ్చాడో చెప్పండి అంటారా.. సరే.. కంటిన్యూ.. కంటిన్యూ..

అది చైనాలోని చోంగ్‌కింగ్. మే 16, ఓ వ్యక్తి ప్రేయసి బర్త్ డే ఆరోజు. దీంతో తన ప్రేయసికి 3,30,000 యువాన్ల విలువైన బొకేను తయారు చేయించి గిఫ్ట్‌గా ఇచ్చాడు ప్రియుడు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 35,70,000 రూపాయలు అన్నమాట. మరి ప్రేమికుండంటే ఆమాత్రం ఖరీదైన గిఫ్ట్ ఇవ్వొద్దా. ఇక.. ఆ బొకేను ఓ ఫ్లవర్ షాపులో తయారు చేయించాడట. దాన్ని తయారు చేయడానికి ఏడుగురు ఉద్యోగులు 10 గంటల పాటు కష్టపడ్డారట. ఇక.. ఈ గిఫ్ట్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం కాస్త అధికారులకు తెలియడంతో.. కరెన్సీని డ్యామేజ్ చేసి బొకే చేయడమేంది.. ఇది చట్టవిరుద్ధమని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అధికారులు మనోడిని కోర్టుకు లాగాలనుకుంటున్నారట. అయితే.. ఆ బొకే వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయన్నది పక్కన బెడితే.. మనోడి గర్ల్ ఫ్రెండ్ మాత్రం వినూత్నమైన గిఫ్ట్‌కు ఫిదా అయిందట. అది చాలదూ మనోడికి. ఇక.. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొంటాడు. ఏమంటారు.

5250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles