ఉబెర్ ఈట్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే గ‌లీజు అండర్‌వేర్ వచ్చింది..!

Wed,December 12, 2018 07:04 PM

Man Gets Soiled Underwear With Uber Eats Food Order

ఇటీవలే కదా జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ కస్టమర్ ఫుడ్‌ను తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై చాలామంది స్పందించారు. ఫుడ్ డెలివరీ యాప్‌ల్లో ఫుడ్ ఆర్డర్ చేసేముందు కాస్త ఆలోచించండి అంటూ చెబుతున్నారు. ఇదే సమయంలో యూఎస్‌లోని ఫ్లొరిడాలో ఉన్న మియామి సిటీలో ఇటువంటిదే మరో ఘటన చోటు చేసుకున్నది. ఇది చాలా దారుణ‌మైన ఘ‌ట‌న‌. ఎందుకంటే.. ఫుడ్ ఆర్డ‌ర్ చేస్తే ఫుడ్‌కు బ‌దులు గ‌లీజుగా ఉన్న అండ‌ర్‌వేర్ల‌ను డెలివ‌రీ చేశారు. చ‌ద‌వ‌డానికే ఎంతో ఇబ్బందిగా ఉంది క‌దా. మ‌రి.. వాటిని ప్ర‌త్య‌క్షంగా చూసిన ఆ క‌స్ట‌మ‌ర్ ప‌రిస్థితి ఎలా ఉండాలి ఊహించుకోండి.

కస్టమర్ పేరు లియో. మియామిలో ఆర్ట్ బసెల్ అనే షో చూడటానికి వెళ్లాడు. ఓ హోటల్‌లో దిగాడు. బాగా ఆకలిగా ఉండటంతో స్మార్ట్‌ఫోన్‌లో ఉబెర్ ఈట్స్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఓ జపనీస్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ ఆర్డర్ వచ్చింది. ఫుడ్ డెలివరీ చేసిన డెలివరీ గర్ల్ వెంటనే అక్కడి నుంచి తుర్రుమంది. ఆ ఫుడ్ ప్యాకెట్ తీసుకొని తన రూమ్‌కు వెళ్లి ఓపెన్ చూసి కంగుతిన్నాడు. ఎందుకంటే.. ఆ ప్యాకెట్‌లో ఉన్నది ఫుడ్ కాదు.. మలం మరకలతో ఉన్న రెండు అండర్‌వేర్‌లు అందులో ఉన్నాయి. దీంతో వాటిని బ్యాగ్‌లో పడేసి ఉబెర్ కస్టమర్ కేర్‌కు, రెస్టారెంట్‌కు, పోలీసులకు కాల్ చేశాడు. వెంటనే స్పందించిన ఉబెర్.. ఆ కస్టమర్‌కు ఫుడ్ ఆర్డర్ చేసిన డబ్బులను రిఫండ్ చేసి ఫుడ్ డెలివరీ చేసే కోరియర్ సంస్థతో ఉన్న టైఅప్‌ను క్యాన్సిల్ చేసి ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు ప్రకటించింది.

5641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles