ఈ సాలీడును చూస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే.. వీడియో

Mon,April 16, 2018 04:35 PM

Man Finds Enormous Spider Inside Car video goes viral

సాధారణంగా సాలీడులు ఎలా ఉంటాయి. పాడుబడ్డ ఇళ్లలో అయితే సాలీడులు బోలెడు కనిపిస్తాయి. కాని.. అవి చాలా చిన్నగా ఉంటాయి. కాని.. ఇప్పుడు మీరు చూడబోయే సాలీడు మాత్రం భయంకరంగా ఉంటుంది. అది కూడా ఎక్కడో పాతబడిన ఇంట్లో ఉంటే ఇప్పుడు మనం దాని గురించి చర్చించుకునేవాళ్లమే కాదు. కాని.. అది ఏకంగా కారులోకే దూరింది. కారు డోర్‌లో దాక్కొని ఉంది. కారు డోర్ ఓపెన్ చేసిన కారు యజమాని ఆ స్పైడర్‌ను చూసి దెబ్బకు షాకయ్యాడు. ఇటువంటి స్పైడర్‌ను ఎప్పుడూ ఎక్కడా చూడలేదే అని ఆశ్చర్యపోయాడు. దాన్ని వీడియో తీసి తన రెడిట్ అకౌంట్‌లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

This hitchhiker is why people die. from r/australia

3124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS