నాలుగెకరాల్లో సార్వభౌమ దేశం

Mon,November 2, 2015 08:50 AM

Man creates 'sovereign nation' in Utah desert

న్యూయార్క్ : అది కూడా ఒక సార్వభౌమ దేశం! ఆ దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ జకీస్థాన్! ఆ దేశానికి ఒక జాతీయ పతాకం ఉంది! రోబోట్లు సెంట్రీలుగా విధులు నిర్వర్తిసాయి! అంతేకాదండోయ్.. ఆ దేశానికి అధికారిక పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి! ఇంతాచేసి ఆ దేశం విస్తీర్ణం.. కేవలం నాలుగెకరాలు!! ఇదెక్కడి దేశమని విస్తుబోకండి! ఇది జక్‌లాండ్స్‌బెర్గ్ అనే న్యూయార్క్ యువకుడు ఉటా అనే ప్రదేశంలో సృష్టించుకున్న ప్రదేశం!! ఈ దేశానికి జక్ అధ్యక్షుడు. ఈ భూమిని జక్ ఆన్‌లైన్‌లో వాయవ్య ప్రాంతంలోని బాక్స్ ఎల్డర్ అనే కౌంటీలో పదేండ్ల క్రితం కొనుగోలు చేశాడు. ఈ లక్ష్యం ఊహాత్మకమైనదే అయినా.. అసాధ్యమయిన దానిని వాస్తవం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని జక్ చెప్తున్నాడు. సరిహద్దు గేటు, సరఫరాల కోసంబంకర్ వంటి ఏర్పాట్లు ఉన్న ఈ దేశంలోకి వచ్చిపోయేవారికి పాస్‌పోర్టులపై స్టాంపింగ్ కూడా ఉంటుంది. దీనిని ఇతరులు గుర్తించరని జక్‌కు కూడా తెలుసు. అయితే కళాత్మక ఖండంగా ఈ ప్రాజెక్టును తాను చేపట్టినట్లు ఆయన చెప్తున్నాడు. అన్నట్టు ఈ జకీస్థాన్‌కు ఒక నీతివాక్యం కూడా ఉందండోయ్!! సంథింగ్ ఫ్రం నథింగ్.. శూన్యం నుంచి ఎంతోకొంత!!

1779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles