మనిషి చెవిలో బొద్దింక ఫ్యామిలీ

Sat,November 9, 2019 03:40 PM

బొద్దింక కనిపిస్తే చాలు కొందరైతే భయపడిపోతుంటారు.. అది హానికరం కూడా. మరి అలాంటి బొద్దింక ఓ మనిషి చెవిలోకి తన ఫ్యామిలీని అంతా తీసుకువచ్చి సతాయించింది. ఈ ఘటన చైనాలోని హుయాంగ్‌ జిల్లాలో గత నెలలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఎల్వీ అనే వ్యక్తి కుడి చెవి దురదగా ఉండడంతో ఆయన ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాడు. ఎల్వీ చెవిని పరిశీలించిన వైద్యుడు.. లోపల బొద్దింకలు ఉన్నట్లు గుర్తించాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా పది పైనే బొద్దింకలు ఉన్నాయి. దీంతో పట్టుకార్ల సహాయంతో ఎల్వీ చెవిలో ఉన్న బొద్దింకలను నెమ్మదిగా బయటకు తీశాడు వైద్యుడు. అయితే ఆహార పొట్లాలు తన బెడ్‌ వద్ద పెట్టుకుని నిద్రించడం వల్లే బొద్దింకలు అతని చెవిలోకి దూరినట్లు డాక్టర్‌ తెలిపాడు.

3440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles