ఎస్కలేటర్‌ను ఎక్కకుండా ఏం చేశాడో తెలుసా?.. వీడియో

Mon,June 11, 2018 04:24 PM

Man climbs up on section between two escalators in China

వెర్రి వెయ్యి విదాలు అన్నట్టు.. ఒక్కోసారి మనుషులు ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. ఇదిగో ఇలాగే ఓ వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. ఎస్కలేటర్‌ను ఎక్కకుండా రెండు ఎస్కలేటర్ల మధ్య ఉన్న సెక్షన్‌పైకి ఎక్కడం ప్రారంభించాడు. దీంతో ఎస్కలేటర్ల మీద వెళ్తున్న వాళ్లు షాక్‌కు గురయి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటన చైనాలోని బీజింగ్‌లో ఉన్న తువాన్‌జియేహు సబ్‌వే స్టేషన్‌లో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే.. ఆ వ్యక్తి విచిత్ర ప్రవర్తనను గమనించిన స్టేషన్ సిబ్బంది అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయాడు. మనోడి వింత ప్రవర్తనకు ఖచ్చితంగా పెనాల్టీ విధించనున్నట్లు స్టేషన్ యాజమాన్యం తెలిపింది.

4530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles