బొద్దింకలను కాల్చబోయి ఇంటినే పేల్చేశాడు!Fri,March 9, 2018 07:26 PM

బొద్దింకలను కాల్చబోయి ఇంటినే పేల్చేశాడు!

ఏదో చేయబోతే ఏదో జరగడమంటే ఇదే కాబోలు. ఓ వ్యక్తికి తన ఇంట్లో ఉన్న బొద్దింకలను చూసి తెగ చిరాకేసిందట. దీంతో వాటిని ఎలాగైనా చంపేయాలని బీభత్సమైన ప్లాన్ వేశాడు. బొద్దింకలను చంపే స్ప్రే, మంట పుట్టించే క్యాన్‌తో వాటి భరతం పడుదామనుకున్నాడు. కాని.. మనోడి ప్లాన్ కాస్త రివర్సయింది. బోద్దింకలను స్ప్రేతో కొట్టి, మంట వచ్చే క్యాన్‌తో చంపేస్తుండగా కథ అడ్డం తిరిగింది.

మంట వచ్చే క్యాన్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇంట్లో ఉన్న కిచెన్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న ఆ వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. వెంటనే అతడిని, ఇంట్లో మంటలను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ మంటలను ఆర్పేసి ఆసుపత్రికి తరలించారు. దీంతో చిన్న గాయాలతోనే ఆ వ్యక్తి బయటపడ్డాడు. కాని.. అతడి కోరిక మాత్రం నేరవేరలేదు. అంతే కాదు.. ఇంకా ఆ బొద్దింకలను చంపాలనే కసి మాత్రం అతడికి అలాగే ఉండిపోయిందట.

ఇక.. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, అధికారులు... స్ప్రేను మంటలకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారట. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పనే లేదు కదూ. ఆస్ట్రేలియాలో.

3573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS