కుక్కపిల్ల అని పెంచుకుంటే.. నల్ల ఎలుగుబంటి అయింది.. వీడియో

Fri,March 16, 2018 05:47 PM

Man adopted puppy three years ago is a black bear in china

చాలా మందికి కుక్కలను ఇంట్లో పెంచుకోవడం అలవాటు. అదే అలవాటుతో చైనాలోని యున్నన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు దొరికిన కుక్కపిల్లను ఇంటికి తీసుకొచ్చి పెంచుకోవ‌డం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత దానిలో వచ్చిన మార్పులను చూసి షాకయ్యాడు. అది కుక్క కాదు ఎలుగు బంటి అని తెలుసుకున్నాడు. ఎనిమిది నెలల్లోనే అది దాదాపు 1.7 మీటర్లు పొడవుతో పాటు 80 కిలోల బరువు పెరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా దాన్ని గొలుసులతో కట్టేసి.. బోన్‌లో వేశాడు. దానికి ఆ బోన్‌లో నుంచే రోజు ఆహారం అందిస్తుండేవాడు. కాని.. ఎలుగు బంటి విషయం లోకల్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు తెలిసేసరికి వాళ్లు వచ్చి దాన్ని యానియల్ షెల్టర్‌కు తరలించారట. దీంతో ఆ కుక్క‌పిల్ల.. సారీ ఎలుగు బంటి క‌థ అలా స‌మాప్త‌మ‌యింది.

8597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS