మరణశిక్ష రద్దు దిశగా అడుగులు

Thu,October 11, 2018 03:08 PM

Malaysia to abolish death penalty Minister

కౌలాలంపూర్: మలేషియా ప్రభుత్వం మరణశిక్షను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. హత్య, కిడ్నాప్, అక్రమాయుధాలు కలిగి ఉండటం, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి నేరాలకు మలేషియా ప్రభుత్వం మరణశిక్షను అమలుచేస్తోంది. ఇప్పటివరకు మలేషియా బ్రిటీష్ కలోనియల్ రూల్ ప్రకారం ఉరిశిక్షను అమలు చేస్తూ వస్తోంది.

దేశవ్యాప్తంగా మానవ హక్కులపై పోరాడే న్యాయవాదుల నుంచి మరణశిక్ష అమలుపై అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం మరణిశిక్షను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి గోవింద్ సింగ్ డియో తెలిపారు. తాజా నిర్ణయం మేరకు చట్టంలో త్వరలోనే మార్పులు జరుగుతాయని ఆశిస్తున్నట్లు డియో చెప్పారు. మరణశిక్ష అనేది అనాగరికమైందని, అతిక్రూరమైన శిక్ష అని మానవహక్కుల తరపు న్యాయవాది ఎన్ సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. మరణశిక్ష రద్దయిందంటే విదేశాల్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న మలేషియన్ల తరపున పోరాడేందుకు కావాల్సిన నైతిక అధికారం మలేషియా ప్రభుత్వానికి రానుంది.

1947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS