మలేసియా రాజును పెళ్లాడిన మాస్కో మాజీ బ్యూటీక్వీన్

Tue,November 27, 2018 07:15 PM

MALAYSIA KING WEDS EX-BEAUTY QUEEN OF MOSCOW

మాస్కో మాజీ బ్యూటీక్వీన్ మలేసియా రాజును పెళ్లాడి క్వీన్‌గా మారిపోయింది. ఒకప్పటి మిస్ మాస్కో ఒక్సానా ఓవదీనా (25) మలేసియా రాజు ముహమ్మద్-5 (49) ఒక్కటయ్యారు. వారి వివాహ మహోత్సవం మాస్కో శివార్లలోని బార్విఖాలో 22న కన్నులపండువగా జరిగింది. ఓవదీనా గతంలో చైనా, థాయ్‌ల్యాండ్‌లో మోడలింగ్ చేశారు. ఈ వివాహం కోసం మలేసియా ఆచారాల ప్రకారం ఓవదీనా ఇస్లాం మతం స్వీకరించి రిహానాగా మారింది. రిహనాతో ఎలా, ఎప్పుడు ప్రేమలో పడిందీ మలేసియా రాజు వెల్లడించలేదు. పెండ్లిలో రాజు సంప్రదాయిక మలేసియా జాతీయ దుస్తులు ధరించగా రిహానా క్రైస్తవ తరహా గౌను ధరించింది. ప్లెఖనోవ్ రష్యన్ అర్థశాస్ర్తాల విశ్విద్యాలయంలో చదువుకున్న రిహానా తండ్రి ఆండ్రీ గోర్బతెంకో సర్జన్. స్కేటింగ్‌లు, బైకులు ఇష్టమని చెప్పే రిహానా పెండ్లిలో మేలిముసుగు ధరించి సిగ్గులు ఒలకబోసింది.

2058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles