భారత్ మిషన్ శక్తిపై చైనా రియాక్షన్ ఇదీ

Wed,March 27, 2019 06:10 PM

Maintain Peace in outer Space says China on Indias Mission Shakti

న్యూఢిల్లీ: అంతరిక్షంలో ఇండియా సాధించిన అరుదైన ఘనతపై చైనా స్పందించింది. మిషన్ శక్తి పేరుతో శాటిలైట్‌ను పేల్చేసే అరుదైన సాంకేతికతను విజయవంతంగా భారత్ పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బుధవారం ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిపై వెంటనే చైనా స్పందించింది. ఈ పరీక్ష విజయవంతమవడంపై మీ స్పందన ఏంటి అన్న పీటీఐ ప్రశ్నకు ఆ దేశం బదులిచ్చింది. ఇండియా ఈ పరీక్ష నిర్వహించినట్లు మాకూ తెలిసింది. అయితే ప్రతి దేశం అంతరిక్షంలో శాంతి కొనసాగేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నాం అని చైనా చెప్పింది. ఈ టెక్నాలజీ చైనా దగ్గర కూడా ఉంది. 2007లోనే ఆ దేశం యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అంతరిక్షంలో పని చేయడం మానేసిన ఓ వాతావరణ ఉపగ్రహాన్ని చైనా అప్పట్లో పేల్చేసింది. భారత్, చైనా కాకుండా అమెరికా, రష్యాల దగ్గర మాత్రమే ఎ-శాట్ టెక్నాలజీ ఉంది. అయితే ఈ మిషన్ శక్తి ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ పరీక్ష నిర్వహించలేదని కూడా తేల్చి చెప్పారు.

4452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles