లుసైల్ స్టేడియం డిజైన్ విడుదల

Tue,December 18, 2018 09:21 AM

Lusail stadium design release

దోహా(ఖతార్): ఫిఫా ప్రపంచకప్ (2022) నిర్వహణ అవకాశాన్ని దక్కించుకున్న ఖతార్ .. ప్రారంభ వేడుకలు నిర్వహించే స్టేడియం డిజైన్‌ను ఆవిష్కరించింది. మధ్యప్రాచ్యంలో మొదటిసారిగా జరిగే ఫిఫా ఫైనల్ కోసం ఖతార్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సహా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలువురు ప్రతినిధులు హాజరుకానున్నారని ప్రపంచకప్ ఉన్నతస్థాయి కమిటీ తెలిపింది. లుసైల్ స్టేడియం సామర్థ్యం 80 వేలు కాగా.. అరబ్ నిర్మాణ శైలిలో స్టేడియం ఆకృతిని బ్రిటన్‌కు చెందిన పోస్టర్-పాట్నర్స్ సంస్థ రూపొందించింది. 4500 కోట్లతో ఖతార్ రాజధాని దోహాకు ఉత్తరంగా 15 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. 2020 ఏడాదికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మైలురాయిగా ఖతార్ ప్రపంచకప్ నిర్వహించే ఉన్నతస్థాయి కమిటీకి నేతృత్వం వహిస్తున్న హసన్ అల్ అభివర్ణించారు.

1369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles