లాటరీ తగిలిన ఆనందంలో బాస్‌పై మూత్రం.. వీడియో

Wed,August 3, 2016 02:25 PM

లండన్ : లాటరీ తగిలితే మీరేం చేస్తారు? ఆనందంతో స్నేహితులతో షేర్ చేసుకొని స్వీట్లు పంచుకుంటారు. లేదంటే మంచి విందు ఏర్పాటు చేస్తారు. కానీ ఈయన మాత్రం విచిత్రంగా ప్రవర్తించి బాస్‌పై మూత్రం పోశాడు. ఈ సంఘటన లండన్‌లోని ఓ ఆఫీస్‌లో చోటు చేసుకుంది. సదరు ఉద్యోగి అన్‌లైన్‌లో ఉండగా లాటరీ తగిలినట్లు సమాచారం తెలిసింది. దీంతో ఆయన కుర్చీపై కిందికి పైకి లేస్తూ ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా అక్కడున్న మహిళా ఉద్యోగుల వద్దకు వెళ్లి ఏదో చేయబోయాడు. వారు భయపడటంతో ఏకంగా బాస్ గదిలోకి వెళ్లి ఆయనపై దాడి చేసి మూత్రం పోసి సంతోషపడ్డాడు. కొందరు ఆనందంలో ఏం చేస్తారో వారికి తెలియదు. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.


5036
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles