మగ సింహాన్ని చంపిన ఆడ సింహం

Mon,October 22, 2018 01:44 PM

Lioness kills the father of her 3 cubs in Indianapolis Zoo

ఇండియానాపొలిస్: ఓ జూలోని ఆడ సింహం తన ముగ్గురు పిల్లలకు తండ్రయిన ఓ మగ సింహంపై దాడి చేసి చంపినట్లు అమెరికాలోని ఇండియానాపొలిస్ జూ అధికారులు వెల్లడించారు. జురీ అనే ఆ 12 ఏళ్ల ఆడ సింహం.. పదేళ్ల న్యాక్ అనే ఆ మగ సింహంపై దాడి చేసింది. జూ సిబ్బంది ఈ దాడిని నియంత్రించడానికి ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. ఈ రెండు సింహాలు ఎనిమిదేళ్లుగా ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి. 2015లో వీటికి మూడు పిల్లలు జన్మించాయి. న్యాక్ కదలకుండా ఉండిపోయే వరకు దాని మెడను జురి గట్టిగా పట్టుకొని ఊపిరి ఆడకుండా చేసిందని జూ నిర్వాహకులు తెలిపారు. మాంసం విషయంలో వీటి మధ్య గొడవ తలెత్తి ఉండొచ్చని వాళ్లు భావిస్తున్నారు. జూలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని ఇండియానాపొలిస్ జూ క్యూరేటర్ డేవిడ్ హాగన్ చెప్పారు.5916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles