మగ కొండచిలువే ఎర.. దొరికిన 17 అడుగుల ఆడ కొండచిలువ

Mon,April 8, 2019 02:58 PM

Largest ever Python caught in Florida using Male Python as Bait

హూస్టన్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ర్టానికి కొండచిలువల భయం పట్టుకుంది. వీటి సంఖ్య రోజురోజుకీ ఊహించని రీతిలో పెరిగిపోతుండటం అక్కడి అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ పైథాన్లు జింకలు, కుందేళ్లు, పక్షులు, ఇతర జీవరాశులను తింటూ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. వీటిని సహజంగా వేటాడే జీవి ఏదీ లేకపోవడంతో ఈ పైథాన్ల సంఖ్య భారీ పెరిగిపోతున్నది. దీంతో వీటిని పట్టుకొని చంపే పనిలో అక్కడి అధికారులు ఉన్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో వీటి వేట కొనసాగిస్తున్నారు. తాజాగా ఇలాగే ఓ మగ కొండ చిలువను ఎరగా వాడుకొని 17 అడుగుల భారీ ఆడ కొండచిలువను పట్టుకున్నారు. ఫ్లోరిడా ప్రాంతంలో ఇప్పటి వరకు ఇంత భారీ పైథాన్ దొరకలేదు. దీని బరువు 64 కిలోలుగా ఉంది.

అంతేకాదు దాని కడుపులో ఏకంగా 73 గుడ్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇంత భారీ పైథాన్.. ఓ జింకను అమాంతం మింగేయగలదు. మగ పైథాన్లకు రేడియో ట్రాన్స్‌మిటర్లను అమర్చి వాటిని ట్రాక్ చేస్తూ ఆడ పైథాన్లను కనిపెట్టే పనిలో అధికారులు ఉన్నారు. దక్షిణ ఫ్లోరిడా ప్రాంతంలో 30 వేల నుంచి 3 లక్షల వరకు పైథాన్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండటంతో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ వాటి వేట కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. కొత్త కొత్త పద్ధతుల్లో ఆడ కొండచిలువలను కనిపెట్టి వాటిని చంపడం వల్ల వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తున్నారు.

9078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles