రొహింగ్యా శిబిరాలపై కొండచరియలు..14 మంది మృతి

Tue,June 12, 2018 04:59 PM

landslides sweep away Rohingya shelters 14 killed

ఢాకా: కుండపోత వర్షాలతో ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్థుల శిబిరాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 14 మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలు, కొండచరియలతో మయన్మార్ సరిహద్దు ప్రాంతం కాక్స్ బజార్, రంగమతి జిల్లాల్లో రోహింగ్యా శరణార్థుల ఇండ్లు, శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయి.

ఈ ప్రాంతాల్లో సుమారు 7 లక్షల మంది రొహింగ్యా ముస్లింలు నివాసముంటున్నారు. కొండ చరియలు పడిన ఘటనలో మృతులను ఇంకా గుర్తించలేదని..భారీ వర్షాలతో సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారుతుందని రంగమతి సివిల్ సర్జన్ షాహిద్ తాలూక్‌డేర్ తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది బురదలో కూరుకుపోయి ఉంటారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించారు. ఏడాది క్రితం ఇదే సమయానికి రంగమతి జిల్లాలో కొండచరియలు 100 మందికి ప్రాణాలు తీశాయని శరణార్థుల సహాయక బృందం ప్రతినిధి ఒకరు తెలిపారు.1576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles