వీడియో: ఆనకొండను అవలీలగా చేతులతో పట్టేసింది!Sat,October 14, 2017 08:14 PM
వీడియో: ఆనకొండను అవలీలగా చేతులతో పట్టేసింది!

పాము ఇక్కడుందంటే.. ఎక్కడో ఉంటారు కొంతమంది. పామును చూస్తేనే దడుసుకుంటారు మరికొందరు. అంద‌రి క‌న్నా భిన్నంగా... ఓ లేడీ పోలీసు ఆనకొండను ఏకంగా చేతులతో పట్టి బ్యాగ్‌లో వేసుకొని వెళ్లింది. యూఎస్‌లోని ఫ్లొరిడాలో ఈ ఘటన జరిగింది. పసుపు రంగులో ఉండి దాదాపు 9 అడుగులు ఉండే ఆనకొండను ఫ్లొరిడాకు చెందిన లేడీ పోలీసు చేతులతో పట్టుకుంది. రోడ్డు పక్కన ఉన్న గుంతలో ఆనకొండను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఈ లేడీ పోలీసు ఓ కర్ర సాయంతో పామును చేతితో పట్టుకొని ఓ బ్యాగ్‌లో వేసింది. ఇక.. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో ఇప్పుడు వైరలయింది.

4654
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS