మళ్లీ కలుద్దాం.. ట్రంప్‌ను కోరిన కిమ్

Tue,September 11, 2018 08:00 AM

Kim Jong Un seeks second meet with Donald Trump in his letter

వాషింగ్టన్: ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఆ లేఖ చాలా పాజిటివ్‌గా ఉందని వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని నెలల క్రితం ఇద్దరు నేతలూ సింగపూర్‌లో చరిత్రాత్మక భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ విధమైన సంబంధాలనే మునుముందు కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తాను రాసిన లేఖలో కిమ్ కోరారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉందని ఆ లేఖ స్పష్టం చేస్తోందని వైట్‌హౌజ్ ప్రతినిధి సారా శాండర్స్ తెలిపారు. మరోసారి ట్రంప్‌ను కలవాలని కిమ్ ఆశిస్తున్నట్లు ఆ లేఖ ద్వారా తెలిసిందని ఆమె తెలిపారు. రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలకు ఇదే నిదర్శమన్నారు.

1518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles