కాల్పుల్లో కాంద‌హార్ పోలీస్ చీఫ్ మృతి

Thu,October 18, 2018 09:28 PM

Kandahar police chief General Razik shot by bodyguard in Afghanistan

కాంద‌హార్ : ఆఫ్ఘ‌నిస్తాన్‌లో మిలిటెంట్ల‌ను గ‌జ‌గ‌జ‌ వ‌ణికించిన జ‌న‌ర‌ల్ అబ్దుల్ రాజిక్.. బాడీగార్డు జ‌రిపిన ఫైరింగ్‌లో ప్రాణాలు విడిచాడు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో అత్యంత శ‌క్తివంత‌మైన భ‌ద్ర‌తా అధికారిగా రాజిక్‌కు గుర్తింపు ఉన్న‌ది. కాంద‌హార్‌లోని గ‌వ‌ర్న‌ర్స్ కాంపౌండ్‌లో మీటింగ్‌కు వెళ్లిన జ‌న‌ర‌ల్ రాజిక్‌పై బాడీగార్డు ఫైరింగ్ జ‌రిపాడు. అయితే దాడి స‌మ‌యంలో అక్క‌డే ఉన్న అమెరికా క‌మాండ‌ర్ జ‌న‌ర‌ల్ స్కాట్ మిల్ల‌ర్ ప్రాణాల‌తో త‌ప్పించుకున్నారు. ఎన్‌డీఎస్ ఇంటెలిజెన్స్ ప్ర‌కారం.. స్థానిక కమాండ‌ర్ హ‌త‌మ‌వ్వ‌గా.. ప్రావిన్సు గ‌వ‌ర్న‌ర్‌కు మాత్రం తీవ్ర గాయాల‌య్యాయి. దాడికి తామే కార‌ణ‌మ‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు. మిలిటెంట్ల ప‌ట్ల క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించిన ఇద్ద‌రు జ‌న‌ర‌ల్స్‌ను టార్గెట్ చేసిన‌ట్లు తాలిబ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మాన‌వ హ‌క్కుల సంఘాలు మాత్రం జ‌న‌ర‌ల్ రాజిక్ వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టేవి. కానీ అమెరికా ఆర్మీ మాత్రం రాజిక్‌ను శ‌క్తివంత‌మైన అధికారిగా గుర్తించింది.

2228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles