అమెరికా అధ్య‌క్ష రేసులో జోసెఫ్ బైడెన్

Thu,April 25, 2019 04:59 PM

Joe Biden launches US presidential bid for 2020 elections

హైద‌రాబాద్: అమెరికా మాజీ ఉపాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్‌.. 2020లో జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల కోసం పోటీప‌డ‌నున్నారు. దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్లు ఆయ‌న వీడియా ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. దీంతో బైడెన్ పోటీ చేస్తారా లేదా అన్న ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. అమెరికాను తీర్చిదిద్దిన విలువ‌లు, ప్ర‌జాస్వామ్యం, అన్నీ ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌న్నారు. 76 ఏళ్ల‌ డెమోక్ర‌టిక్ పార్టీ నేత అయిన బైడెన్‌.. ఒబామా పాల‌న స‌మ‌యంలో వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ఇప్ప‌టికే 19 మంది త‌మ అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించారు. దాంటో సేనేట‌ర్లు ఎలిజ‌బెత్ వారెన్‌, క‌మ‌లా హారిస్‌, బెర్నీ శాండ‌ర్స్ ఉన్నారు.

1654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles