నా తనయుల తండ్రే కాబోయే ప్రధానమంత్రి!

Thu,July 26, 2018 04:04 PM

Jemima Khan congratulates his ex husband Imran Khan on his victory in Pakistan Elections

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆయన మాజీ భార్య జెమీమా ఖాన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫలితాలను ఇంకా అధికారికంగా ప్రకటించకముందే.. ఇమ్రాన్‌ఖాన్‌కు అభినందనలు చెబుతూ ట్వీట్ చేసింది. మొత్తం 272 స్థానాలకుగాను పీటీఐ 120 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో తన మాజీ భర్తను చూసి జెమీమా పొంగిపోతున్నది. 22 ఏళ్లుగా ఎన్నో అవమానాలు, అడ్డంకులు, త్యాగాలు చేసిన తర్వాత నా తనయుల తండ్రి పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించని మనస్తత్వానికి ఈ విజయం నిదర్శనం. ఇక ఇప్పుడు తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో తెలుసుకోవడమే ఆయన ముందున్న అతిపెద్ద సవాలు అని జెమీమా ట్వీట్ చేసింది.


ఇమ్రాన్‌ఖాన్‌కు ఇద్దరు తనయులు. ఒకరు సూలియామన్ ఇసా ఖాన్, మరొకరు ఖాసీ ఖాన్. పాకిస్థాన్‌లో ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచీ వీళ్లు ఎన్నికలపై చాలా ఆసక్తి చూపారు. మీరు కోరుకున్న లీడర్ మీకు రావాలి.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ బుధవారం ఓటింగ్ మొదలయ్యే ముందు కూడా జెమీమా ఓ ట్వీట్ చేసింది. 1995లో జెమీమా, ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నారు. 2005లో విడిపోయారు. ఆ తర్వాత జెమీమా లాహోర్ నుంచి లండన్ వెళ్లిపోయింది. అయినా ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి.

4437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles