జపాన్‌లో లక్ష్మీదేవి పట్టణం

Mon,August 13, 2018 03:22 PM

japanese town named after laksmi

జపాన్‌లో లక్ష్మీదేవి పేరిట ఓ పట్టణం ఉంది. ఆ సంగతి బెంగళూరులోని జపాన్ కాన్సల్ జనరల్ టకయుకి కిటగావా వెల్లడించారు. లక్ష్మీదేవి ఆలయం ఉండడం వల్లనే ఆ పట్టణానికి కిచిజోయి అనే పేరు వచ్చిందని కూడా ఆయన వివరించారు. జపాన్ భాషలో లక్ష్మీ ఆలయాన్ని కిచియోజీ అంటారని చెప్పారు. జపాన్ సంస్కృతిపై భారత ప్రభావం చాలా ఉన్నదని, అంతేకాకుండా అనేక సంస్కృతపదాలు జపాన్ భాషలో కనిపిస్తాయని పేర్కొన్నారు. ఓ పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత, జపాన్‌ల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. అనేకమంది రెండు దేశాలు విభిన్నమైనవని అనుకుంటారని, నిజానికి జపాన్‌లో అనేక ఆలయాలు హిందూ దేవతల కోసం నిర్మించినవేనని కిటగావా వెల్లడించారు.

97
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles