ఆస్ట‌రాయిడ్‌పై దిగిన హ‌య‌బుసా

Fri,February 22, 2019 01:49 PM

Japanese space probe Hayabusa 2 touches down on asteroid to collect samples

టోక్యో: భూమికి సుమారు 30 కోట్ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఆస్ట‌రాయిడ్‌పై.. జపాన్ పంపిన హ‌య‌బుసా 2 వ్యోమ‌నౌక దిగింది. విశ్వంలో జీవానికి అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఉందా లేదా అన్న అధ్య‌య‌నం చేసేందుకు ఈ ప‌రిశోధ‌న చేప‌ట్టారు. ఆస్ట‌రాయిడ్ ర్యుగుపై హ‌య‌బుసా దిగిన‌ట్లు జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఆ గ్ర‌హ‌శ‌క‌లం సుమారు 900 మీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న‌ది. వాస్త‌వానికి గ‌త అక్టోబ‌ర్‌లో ఆస్ట‌రాయిడ్‌పై హ‌య‌బుసా దిగాల్సి ఉంది. కానీ ల్యాండింగ్ స్పాట్ దొర‌క్క‌పోవ‌డంతో జాప్యం జ‌రిగింది. ర్యుగు ఆస్ట‌రాయిడ్‌పై ఉన్న చిన్న చిన్న రేణువుల‌ను సేక‌రించి.. వాటిని విశ్లేష‌ణ కోసం భూమికి తీసుకురానున్నారు. ప్రాజెక్టులో కొంత ఆల‌స్యం జ‌రిగినా, విజ‌య‌వంతంగా పూర్తి చేశామ‌ని ప్రాజెక్టు మేనేజ‌ర్ యుచి సుడా తెలిపారు. ఆస్ట‌రాయిడ్‌పై ఓ జ‌పాన్ స్పేస్‌క్రాఫ్ట్ దిగ‌డం ఇది రెండ‌వ సారి. గ‌తంలో 2005లో టొకోవా ఆస్ట‌రాయిడ్‌పై హ‌య‌బుసా దిగింది. భూమిపై జీవానికి, ర్యుగు గ్ర‌హ‌శ‌క‌లానికి సంబంధాలు ఉండి ఉంటాయ‌ని శాస్త్ర‌వేత్తలు భావిస్తున్నారు. 2020లో హ‌య‌బుసా 2 మ‌ళ్లీ భూమికి చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

1301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles