25 సెకండ్లు ముందుగా వెళ్లిన ట్రెయిన్.. క్షమాపణలు చెప్పిన రైల్వే సిబ్బంది

Thu,May 17, 2018 04:36 PM

Japan train leaves 25 seconds early and Department Apologized

ఏంటి.. 25 సెకండ్లు ముందుగా ట్రెయిన్ వెళ్లినందుకు క్షమాపణలు చెప్పారా? ఇదేం విడ్డూరం నాయనా? అని దీర్ఘాలు తీయకండి. మన దగ్గర 25 నిమిషాలు లేటుగా వచ్చినా అడిగే వాళ్లు ఉండరు కాని.. అది మనదేశం కాదు. జపాన్‌లో. అవును.. జపాన్‌లో టైమ్ అంటే టైమే. ఒక సెకండ్ కూడా లేట్ ఉండదు. దేంట్లో అయినా వాళ్లు అంతే. వాళ్లు కాస్త డిఫరెంట్ లేండి. ఈ సోది ఆపి అసలు విషయానికి రమ్మంటారా.. సరే పదండి తెలుసుకుందాం.

జపాన్‌లో ఓ ట్రెయిన్ వెళ్లాల్సిన టైమ్ కంటే కాస్త ముందుగా.. అంటే 25 సెకండ్ల ముందుగా ప్లాట్‌ఫాం నుంచి కదిలింది. అయితే.. ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ కాదు. ట్రెయిన్ డ్రైవర్ సరిగ్గా టైమ్ చూసుకోక ముందుగానే ట్రెయిన్‌ను కదిపాడు. దీంతో డ్రైవర్ చేసిన తప్పిదాన్ని తమ మీద వేసుకొని క్షమాపణలు చెప్పింది రైల్వే కంపెనీ.

జపాన్‌లోని నొటోగోవా స్టేషన్‌లో ఉదయం 7.12 నిమిషాలకు బయలుదేరాల్సిన ట్రెయిన్.. 7.11.35 సెకండ్లకు బయలుదేరిందట. దీనివల్ల ఓ ప్యాసెంజర్ ట్రెయిన్‌ను మిస్ అయ్యాడట. దీంతో ఆ ప్యాసెంజర్ స్టేషన్ ఇంచార్జికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం కాస్త పైఅధికారులకు తెలియడంతో ట్రెయిన్ 25 సెకండ్లు ముందుగా వెళ్లినట్లు తేలింది. దీంతో తమ తప్పిదానికి క్షమించాలంటూ వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ లోకల్ న్యూస్ పేపర్లన్నింటిలో స్టేట్‌మెంట్ ఇచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పిదం జరగకుండా చూసుకుంటామని ప్రయాణికులకు తెలిపింది. అయితే.. జపాన్‌లో ఇటువంటి ఘటన జరగడం ఇదే కొత్తేమీ కాదు. గత సంవత్సరం నవంబర్‌లో ఇలాగే ఓ ట్రెయిన్ 20 సెకండ్లు ముందుగా వెళ్లింది. అప్పుడు కూడా కంపెనీ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.

5489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles