3 నిమిషాలు ముందుగా లంచ్ బ్రేక్ తీసుకున్నాడని శాలరీ కట్!

Thu,June 21, 2018 04:13 PM

Japan employee salary cut for taking lunch break 3 minutes early

జపాన్ అంటే సిస్టమాటిక్.. సిస్టమాటిక్ అంటే జపాన్. అది ఎవ్వరి మాట వినదు. అక్కడి ప్రజలు అంతా ఓ సిస్టమ్‌ను ఫాలో అవ్వాల్సిందే. అందరూ ఫాలో అవుతారు కాబట్టే.. సునామి, భూకంపాలు జపాన్‌ను అల్లకల్లోలం సృష్టించినా.. త్వరగా పుంజుకొని ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఇతర దేశాలకు సవాల్ విసురుతున్నది.

అసలు విషయానికి వస్తే.. కొబేలో ఉన్న వాటర్ వర్క్స్ బ్యురోలో పని చేస్తున్న ఓ ఆఫీసర్‌కు అరుదైన ఫైన్ వేసి రికార్డు సృష్టించారు బ్యురో ఉన్నత స్థాయి అధికారులు. కేవలం 3 అంటే మూడు నిమిషాలు ముందుగా లంచ్‌కు వెళ్లాడని అతడికి రిమార్క్ వచ్చింది. హాఫ్ డే శాలరీ కట్ చేయడంతో పాటు ముందుగా లంచ్ బ్రేక్ తీసుకున్నందుకు అధికారుల ముందు క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు.

"లంచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది. కాని.. ఒంటి గంట కంటే ముందే ఆ ఆఫీసర్ తన డెస్క్ నుంచి బయటకు వస్తాడు. లంచ్ కొనడం కోసమని ఆయన త్వరగా బయటికి వెళ్తాడు. గత ఏడు నెలల నుంచి ఇప్పటి వరకు దాదాపు 26 సార్లు లంచ్ బ్రేక్ కంటే ముందే అతడు బయటికి వెళ్లిపోయాడు. నిజంగా ఇది దురదృష్టకరమైన ఘటన. దానికి మేము చింతిస్తున్నాం.." అంటూ బ్యురో అధికారులు తెలిపారు.

ఇక.. ఈ వార్త ఆనోటా ఈనోటా పడి చివరకు సోషల్ మీడియాలో షేర్ అవడంతో జపాన్‌లో ఇప్పుడు ఈ ఘటన గురించే చర్చ నడుస్తున్నది. అయితే.. నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. "అరె.. కనీసం బాత్‌రూంకు కూడా పోకూడదా. సిగిరేట్ తాగడానికి కూడా సమయం కేటాయించుకోకూడదా.." అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదే సిటీలో గత ఫిబ్రవరిలో ఓ అధికారిని ఇలాగే సస్పెండ్ చేశారు. ఆఫీసు డ్యూటీ సమయంలో లంచ్ బాక్స్‌ను కొనడానికి ఆయన చాలాసార్లు బయటికి వెళ్లినందుకుగాను ఓ నెల పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఓ ఆరు నెలల పాటు కనీసం 55 గంటలు ఆఫీసు డ్యూటీలో బయటికి వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. వామ్మో.. మీరూ మీ రూల్సూ..

3409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles