వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి ఇవాంకా ట్రంప్ !

Sat,January 12, 2019 11:19 AM

Ivanka Trump possible US candidates to replace outgoing World Bank President Jim Yong Kim

వాషింగ్ట‌న్: ప్రపంచ బ్యాంకు అధ్య‌క్షుడు జిమ్ యాంగ్ కిమ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రెండవ సారి అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌డుతున్న ఆయ‌న‌కు ఇంకా మూడేళ్ల స‌ర్వీస్ ఉంది. కానీ వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ హోదా నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు ఆయ‌న సోమ‌వారం చెప్పారు. దీంతో ఆ అధ్య‌క్ష రేసు కోసం కొంద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. యూఎన్ అంబాసిడ‌ర్ నిక్కీ హ‌లే, అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా అమెరికా అభ్య‌ర్థులుగా వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రి పేర్ల‌తో పాటు మ‌రికొంత మంది పేర్ల‌కు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హిళ వ్యాపార‌వేత్త‌ల సాధికార‌త కోసం 2017లో ఇవాంకా ట్రంప్ భారీగా నిధులు సేక‌రించారు. సుమారు వంద కోట్ల డాల‌ర్ల నిధుల‌ను ఆమె సేక‌రించి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు. దీంతో ఇవాంకా కూడా వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ నామినేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వ‌ర‌ల్డ్ బ్యాంక్‌లో ఎక్కువ శాతం షేర్లు అమెరికావే. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఏర్పాటు అయిన ఆ బ్యాంక్‌కు అమెరికా ప్ర‌తిపాదించిన వ్య‌క్తులే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వ‌చ్చే నెల నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ఉంటుంద‌ని, ఏప్రిల్‌లో వ‌ర‌ల్డ్ బ్యాంక్ నూత‌న అధ్య‌క్షుడిని ప్ర‌క‌టిస్తారు.

2359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles