గ్యాలరీలో గర్ల్‌ఫ్రెండ్..సభలోనే ప్రపోజ్ చేసిన ఎంపీ..వీడియో

Fri,November 29, 2019 06:38 PM


ప్రేమ..రెండు అక్షరాల పదం. ఈ ప్రేమను వ్యక్తపరచడానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. సాధారణంగా స్నేహితుల మధ్య కానీ లేదా ఏదైనా ఫంక్షన్లు జరుగుతున్నపుడు కానీ..అందరూ కలిసినపుడు కానీ లవర్స్ తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. తాజాగా ఓ ఇటాలియన్ ఎంపీ లవ్ ప్రపోజ్ చేసేందుకు పార్లమెంట్ నే వేదిక చేసుకున్నారు. ఎంపీ ఫ్లావో డి మురో పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్నారు. సభలో ఉన్న గ్యాలరీలో ఫ్లావో స్నేహితురాలు ఎలీసా కూర్చొని ఆయన ప్రసంగాన్ని వింటోంది.


ప్రసంగం మధ్యలో ఎంపీ ఫ్లావో తన వెంట తెచ్చుకున్న ఉంగరాన్ని ఎలీసా వైపు చూపించి..ఆమెను ప్రపోజ్ చేశారు. సరికొత్తగా ఆలోచించి పార్లమెంట్‌లోనే తన ప్రేయసిని ప్రపోజ్ చేసిన ఎంపీ ఫ్లావోపై సహచర సభ్యులు అభినందనలతో ముంచెత్తారు. ఎంపీ ఫ్లావో, ఎలీసా ప్రేమ సన్నివేశంతో సభలో కాసేపు సందడి వాతావరణం నెలకొంది. ఎంపీ ఫ్లావో సభలో తన ప్రేయసికి ప్రపోజ్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.4323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles