15వేల టన్నుల బ్రిడ్జిని 81 డిగ్రీలు తిప్పడానికి రెండు గంటలు.. వీడియో

Sat,April 21, 2018 04:47 PM

It took two hours to rotate massive 15,000 Ton bridge in china

అది 15 వేల టన్నుల బరువున్న బ్రిడ్జి.. అంటే దాదాపు కోటీ 50 లక్షల కిలోల బ్రిడ్జి. దాన్ని 81 డిగ్రీల కోణంలో తిప్పడానికి సిబ్బంది కనీసం రెండు గంటల సమయం తీసుకున్నారు. ఈ ఘటన చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది. నన్యాంఘే బ్రిడ్జిని బీజింగ్, గ్జిన్జియాంగ్ హైవేపై నిర్మిస్తున్నారు. మొత్తం 2450 కిలోమీటర్ల మేర‌ ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే 100 మీటర్ల పొడవు ఉన్న ఈ బ్రిడ్జిని దానికి సమాంతరంగా తిప్పడం కోసం సిబ్బంది రెండు గంటలు కష్టపడ్డారు. వచ్చే సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఈ బ్రిడ్జి పూర్తవనుంది. ఇక.. ఈ బ్రిడ్జిని 81 డిగ్రీల కోణంలో తిప్పిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

4793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS