అది వింత చేప కాదు.. ఓ కళాఖండం!

Sat,December 16, 2017 05:13 PM

it is an art not a man look alike fish

సోషల్ మీడియాలో వైరలయ్యే వార్తల్లో నూటి తొంబై శాతం వార్తలు ఫేకేనని అందరికీ తెలుసు. కాని.. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవడమే నెటిజన్లకు ప్రస్తుతం పెద్ద పరీక్ష. రీసెంట్‌గా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. మనిషిని పోలిన ఓ వింత చేప విశాఖ తీరంలో జాలర్లకు దొరికిందంటూ నిన్న తెగ వార్తలు వచ్చాయి. అయితే.. అది ఏమాత్రం నిజం కాదట. అసలు అది ప్రాణం ఉన్న చేపే కాదట. అదో కళాఖండమట. ఓ ఆర్టిస్ట్ దాన్ని గీశాడట. మీరు పైన చూస్తున్న ఫోటో అదే. ఆ కళాఖండాన్ని పట్టుకొని దానిపై ఇష్టమొచ్చినట్లు రాసి సోషల్ మీడియాలో కావాలనే కొంతమంది వైరల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో ఏది ఫేకో తెలుసుకోలేక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.

10663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS