చంద్రుడిపై దిగ‌బోతూ కూలిన స్పేస్‌క్రాఫ్ట్‌

Fri,April 12, 2019 01:19 PM

Israels Beresheet spacecraft crashes on Moon while landing

హైద‌రాబాద్‌: చంద్రుడి మీద ప‌రిశోధ‌న‌కు వెళ్లిన ఇజ్రాయిల్‌కు చెందిన వ్యోమ‌నౌక బెరీషీట్ కుప్ప‌కూలింది. ల్యాండింగ్ స‌మ‌యంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ కూలిన‌ట్లు తెలుస్తోంది. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగుతున్న స‌మ‌యంలో స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం త‌లెత్తింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని ప్ర‌ధాన ఇంజిన్ ఫెయిల్ కావ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. చంద్రుడి ఫోటోలు తీయ‌డం, మ‌రికొన్ని ర‌కాల ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించేందుకు ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్ర‌యోగించారు. చంద్రుడిపై వ్యోమ‌నౌక‌ను దించాల‌నుకున్న నాలుగ‌వ దేశంగా ఇజ్రాయిల్ నిలువాల‌ని ఆశించింది. అయితే కొన్ని ప్రైవేటు సంస్థ‌ల‌తో క‌లిసి ఇజ్రాయిల్ ఈ ప్ర‌యోగాన్ని నిర్వ‌హించింది. గ‌తంలో ర‌ష్యా, అమెరికా, చైనా ప్ర‌భుత్వ అంత‌రిక్ష సంస్థ‌లే చంద్రుడిపై త‌మ స్పేస్‌క్రాఫ్ట్‌ల‌ను ల్యాండ్ చేశాయి. ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతాన్యూ కంట్రోల్ రూమ్ నుంచి ప్ర‌యోగాన్ని వీక్షించారు. మొద‌టిసారి విఫ‌ల‌మైనా, ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాల‌న్నారు.

1993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles