ఇస్లామిక్ స్టేట్ నేత అల్ బాగ్దాది వీడియో రిలీజ్

Tue,April 30, 2019 12:28 PM

Islamic State leader al-Baghdadi appears in video message

హైద‌రాబాద్‌: ఇస్లామిక్ స్టేట్ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ ఉగ్ర‌సంస్థ నేత అబూ బాక‌ర్ అల్ బాగ్దాది ఆ వీడియోలో సందేశం ఇచ్చాడు. ఇరాక్‌, సిరియా దేశాల్లో కోల్పోయిన త‌మ ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకుంటామ‌ని ఆ వీడియోలో ప్ర‌తీకార ప్రసంగం చేశాడు. సిరియా, ఇరాక్‌లో కాలిఫా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు 2014లో ప్ర‌క‌టించిన త‌ర్వాత అబూ బాక‌ర్ ఆచూకీ లేదు. చాన్నాళ్ల త‌ర్వాత బాగ్దాది వీడియో రిలీజైంది. బాగూజ్‌లో కోల్పోయిన ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకుంటామ‌న్నాడు. నిజానికి ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియ‌దు. ఏప్రిల్‌లో ఈ వీడియో తీసి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. మిలిటెంట్ సంస్థ అల్ ఫుర్క‌న్ మీడియా సైట్‌లో దీన్ని పోస్ట్ చేశారు. సిరియాలోని బ‌గూజ్ ప‌ట్ట‌ణాన్ని స్వాధీనం చేసుకున్న దానికి ప్ర‌తీకారంగా శ్రీలంక‌లో పేలుళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లు బాగ్దాది వీడియోలో చెప్పాడు.

1866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles