ఐసిస్‌పై అమెరికా వైమానిక దాడులు, 30 మంది మృతి

Fri,February 19, 2016 05:53 PM

Islamic State: Bombing strikes militants in Libya

సబ్రతా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల శిబిరాన్ని టార్గెట్ చేస్తూ లిబియాలోని సబ్రతా పట్టణంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఆ దాడిలో సుమారు 30 మంది చనిపోయారు. టునీషియాలో మారణహోమం సృష్టించిన జిహాదీని టార్గెట్ చేస్తూ దాడి చేపట్టినట్లు అమెరికా మీడియా పేర్కొంది. గత ఏడాది జరిగిన రెండు ఉగ్ర దాడులకు ఆ జిహాదీనే ప్రధాన సూత్రధారి. ఇరాక్, సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన టాప్ కమాండర్లు, ఫైటర్లు లిబియాకు తరలి వెళ్లినట్లు తెలుస్తోంది. లిబియా రాజధాని ట్రైపోలికి పశ్చిమ దిశగా ఉన్న సబ్రతా నగరంపై జరిగిన దాడిలో ఓ బిల్డింగ్ కూలిపోయింది.

2092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles