నవాజ్ షరీఫ్ జైలు శిక్ష రద్దు

Wed,September 19, 2018 03:59 PM

Islamabad High Court suspends Nawaz Sharif jail term in Avenfield case

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు.. అవెన్‌ఫీల్డ్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం నవాజ్‌ను రిలీజ్ చేయాలని ఇవాళ ఇస్లామాబాద్ హై కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను ఇస్లామాబాద్ కోర్టు రద్దు చేసింది. జస్టిస్ అథర్ మినల్లా, జస్టిస్ మియంగుల్ హసన్ ఔరంగజేబులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో షరీఫ్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన అడియాలా జైలులో ఉన్నారు. ఈ తీర్పుతో షరీఫ్ జైలు నుంచి విడుదల కానున్నారు. అవెన్‌ఫీల్డ్ కేసులోనే మరియం నవాజ్‌కు 8 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. రూ.5 లక్షల బాండ్ పూచీకత్తుపై కేసులో శిక్షను అనుభవిస్తున్న ముగ్గుర్ని రిలీజ్ చేయాలంటూ ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. కెప్టెన్ సఫ్‌దార్ కూడా ఈ కేసులో ఏడాది జైలు శిక్షను అనుభవిస్తున్నారు. నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో తరపున ప్రాసిక్యూటర్ అక్రమ్ ఖురేషి ఇవాళ ఉదయం తన వాదనలు వినిపించారు.

1950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles